Stock Market: లాభాలతో ముగిసిన మార్కెట్లు

Arun Chilukuri
Updated on: 9 March 2021 4:19 PM IST
Stock Markets Ended with Profit
X

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల ముగింపు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్ లో స్వల్ప లాభాలతో సరిపుచ్చుకున్న దేశీ సూచీలు గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో తాజా సెషన్ లో లాభాల బాటన దూకుడుగా సాగాయి. అమెరికా బాండ్ల రాబడులు పెరగడంతో పాటు ముడి చమురు ధరల తగ్గుదల వంటి సానుకూల సంకేతాలను దేశీ సూచీలు అందిపుచ్చుకున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 580 పాయింట్ల మేర జంప్ చేయగా నిఫ్టీ 15 వేల పాయింట్ల కీలక మైలు రాయిని అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 584 పాయింట్ల మేర ఎగసి 51,025 వద్దకు చేరగా నిఫ్టీ 142 పాయింట్ల మేర లాభంతో 15,098 వద్ద స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story