Stock Market: భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు

Stock Market: భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ కీలకమైన 51 వేల పాయింట్ల దిగువకు చేరగా నిఫ్టీ 15 వేల మార్క్‌ను కోల్పోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397 పాయింట్లు కోల్పోయి 50,395 వద్దకు చేరగా, నిఫ్టీ 101 పాయింట్లు క్షీణించి 14,929 వద్ద స్థిరపడ్డాయి. ఆరంభ ట్రేడింగ్ లోనే ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు క్రమంగా దిగజారుతూ చివరకు భారీ నష్టాలను మిగిల్చాయి. బ్యాకింగ్‌, ఆర్థిక రంగాల్లోని షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లలో చాలా సూచీలు నష్టాల్లో పయనిస్తుండడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు సూచీలపై ప్రభావం చూపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories