Stock Market: భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Published on: 17 March 2021 4:26 PM IST
Stock Market: భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు
X

భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభం కాగా, సెన్సెక్స్‌ 50,436 వద్ద, నిఫ్టీ 14,946 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. అయితే మిడ్ సెషన్ సమయానికి ఆరంభ లాభాలను చేజార్చుకుని నష్టాల బాటన కొనసాగాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 562 పాయింట్లు క్షీణించి 49,801 వద్దకు చేరగా నిఫ్టీ 189 పాయింట్లు కోల్పోయి 14,721 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పరపతి నిర్ణయాల వెల్లడి నేపధ్యంలో మదుపర్ల అప్రమత్తత ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story