Stock Market: బుల్స్ ఆర్ బ్యాక్ టూ గ్రౌండ్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 358, నిఫ్టీ 104 పాయింట్లు లాభం

Shekhar G
Updated on: 21 Dec 2023 9:31 PM IST
Stock Markets Ended In Huge Gains
X

Stock Market: బుల్స్ ఆర్ బ్యాక్ టూ గ్రౌండ్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద అమ్మకాలకు దిగడంతో నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. సెన్సెక్స్‌ 350కి పైగా షేర్లతో లాభాల్లో ముగియగా.. నిఫ్టీ 21,250 పాయింట్ల ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 69,920 వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఆపై రోజంతా లాభాల్లో కదలాడింది. ఇంట్రాడేలో 69,920 - 70,930 మధ్య కదలాడిన సూచీ.. కనిష్ఠాల నుంచి ఏకంగా వెయ్యి పాయింట్ల మేర లాభపడింది. చివరికి 358 పాయింట్ల లాభంతో 70,865 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 104 పాయింట్లు లాభపడి 21,255 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.27గా ఉంది.

Shekhar G

Shekhar G

Next Story