Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: సెన్సెక్స్ 354.45, నిఫ్టీ 111 పాయింట్లు గెయిన్
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 354.45 పాయింట్ల లాభంతో 75 వేల 038.15 వద్ద ముగియగా.. నిఫ్టీ సైతం 111 పాయింట్ల లాభంతో 22 వేల 753.80 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో రిలయన్స్, ఐటీసీ, ఎయిర్‌టెల్ వంటి షేర్లలో కొనుగోళ్లు.. సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్‌లో ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి.
Next Story




