Stock Markets: ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్ల దూకుడు

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Published on: 29 Dec 2021 6:17 PM IST
Stock Markets Closed in Green; Sensex Gains 477 Points & Nifty Ends at 17,233
X

Stock Markets: ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్ల దూకుడు

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లోకి జారుకున్నా క్రమంగా పుంజుకుని లాభాల బాట పట్టాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 477 పాయిట్ల లాభపడి 57వేల 897 దగ్గరకు చేరింది. అటు నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో 17వేల 233 దగ్గర ముగిసింది.

ఇక సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 28 లాభాల్లో ముగియగా నిఫ్టీలోని 50 కంపెనీల్లో 48 ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో సాను కూల ట్రేడింగ్‌ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మదుపర్లు ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు కొనసాగించడం మార్కెట్ల లాభాలకు దోహదపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story