భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

*843 పాయింట్ల నష్టంతో 57,147 వద్ద ముగిసిన సెన్సెక్స్ *257 పాయింట్లు కోల్పోయి 16,983 వద్ద క్లోజయిన నిఫ్టీ

Rama Rao
Published on: 11 Oct 2022 7:35 PM IST
Stock market Updates Today | Business News
X

భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్ చివరి వరకు అదే ట్రెండ్ కొనసాగింది. ట్రేడింగ్ ముగిసే చివరి గంటలో ఇన్వెస్టర్లు చేతులు ఎత్తేశారా అనే రీతిలో ట్రేడింగ్ సాగింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 843 పాయింట్ల నష్టంతో 57 వేల 147వద్ద స్థిరపడింది. నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి 16 వేల 983 వద్ద క్లోజయ్యింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.37 వద్ద నిలిచింది.

Rama Rao

Rama Rao

Next Story