Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

Stock Market: 567 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్

Shashank Gullapelli
Published on: 21 March 2024 11:44 AM IST
Stock Market Trading At Profit
X

Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 172 పాయింట్లు లాభపడి 22,011కు చేరింది. సెన్సెక్స్‌ 567 పాయింట్లు పుంజుకుని 72,659 వద్ద ట్రేడయింది. అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 103.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 86.2 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.9 శాతం, నాస్‌డాక్‌ 1.25 శాతం లాభపడ్డాయి. అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా మార్కెట్లు పెరిగాయి. ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ 2024 ముగిసే వరకు మూడుసార్లు వడ్డీరేట్లు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే ఈసారి మాత్రం కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచారు. ఇప్పటికే మార్కెట్‌ చాలా పడిపోయింది కాబట్టి ఈ వ్యవహారాన్ని మార్కెట్‌ పాజిటివ్‌గానే తీసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story