Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది.

Arun Chilukuri
Published on: 30 Aug 2022 4:29 PM IST
Stock Market Today Sensex Zooms Above1600 pts Nifty Nears 17800
X

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది. నిన్న భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు ఇవాళ రాకెట్‌లా దూసుకెళ్లాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల జోరు కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లకు జోష్ పెంచింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,564 పాయింట్ల లాభంతో 59 వేల 537 దగ్గర ముగిసింది. నిఫ్టీ 446 పాయింట్లు ఎగబాకి 17 వేల 759 వద్ద క్లోజయ్యింది. ఈ రోజు అన్ని షేర్లు లాభాలు ఆర్జించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story