Stock Market Today: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి.

Arun Chilukuri
Published on: 9 Jan 2023 5:28 PM IST
Stock Market Today Sensex Zooms Above 846 pts Nifty Settles At 18,101
X

Stock Market Today: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. ఇన్వెస్టర్లు ఏకంగా 3 లక్షల కోట్ల లాభాలను ఆర్జించారు. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో సానుకూలంగా ఉన్నమార్కెట్లలో చివరి వరకు అదే జోష్ కనిపించింది. దీంతో వీకెండ్ భారీ నష్టాల నుంచి మార్కెట్లు తేరుకుని ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి.

అమెరికా ఉద్యోగ గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, చైనా కరోనా ఆంక్షల సడలింపు, రూపాయి పుంజుకోవడం దేశీయ మార్కెట్లకు ఊపునిచ్చాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 846 పాయింట్ల భారీ లాభంతో 60 వేల 747 వద్ద ముగిసింది. నిఫ్టీ 241 పాయింట్లు లాభపడి 18 వేల 101 వద్ద స్థిరపడింది. మొత్తమ్మీద సెన్సెక్స్ మళ్లీ 60 వేల మార్క్‌ను, నిఫ్టీ 18 వేల మార్క్‌ను దాటాయి. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ దాదాపు 43 పైసలు పెరిగి 82.33 వద్ద స్థిరపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story