Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.

Arun Chilukuri
Published on: 5 Sept 2022 8:59 PM IST
Stock Market Today Sensex Zooms Above 443 pts Nifty Nears 17666
X

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మార్కెట్లు అదే జోరు కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 443 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 59 వేల 246కి చేరుకుంది. నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 17 వేల 666 వద్ద ముగిసింది. అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు ప్రపంచ మార్కెట్లను కలవరపెట్టాయి. దీంతో నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆగస్టులో దేశంలో సేవారంగ కార్యకలాపాల్లో బలమైన వృద్ధి నమోదైనట్లు గణాంకాలు వెల్లడించాయి. అలాగే రిలయన్స్‌, ICICI బ్యాంక్‌, HDFC బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కూడా సూచీలకు కలిసొచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story