Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల పంట పండించాయి.

Arun Chilukuri
Updated on: 12 Sept 2022 7:30 PM IST
Stock Market Today Sensex Zooms Above 322 pts Nifty Nears 17936
X

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల పంట పండించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 59 వేల 912 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 60 వేల 286 పాయింట్లను టచ్ చేసి చివరకు 60 వేల 115 వద్ద స్థిరపడింది. మొత్తమ్మీద సెన్సెక్స్ 322 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 17వేల 891 పాయింట్ల దగ్గర జోష్‌గా ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17వేల 981 పాయింట్లకు టచ్ అయ్యింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 103 పాయింట్ల లాభంతో 17వేల 936 వద్ద నిఫ్టీ క్లోజయ్యింది. దేశీయంగా స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం కూడా సూచీలను ముందుకు నడిపించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story