Stock Market Today: భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు

Stock Market Today: స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి.

Arun Chilukuri
Published on: 22 Dec 2025 4:55 PM IST
Stock Market Today: భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు
X

Stock Market Today: స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. రూపాయి కొంతమేర నిలకడగా ఉండటం, అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలతో కీలక సూచీలు ఎగిశాయి. వచ్చే ఏడాదిలో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు మార్కెట్ లో జోష్ నింపాయి. పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. మొత్తంమీద సెన్సెక్స్ 638 పాయింట్ల లాభంతో 85,567 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 206 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 26,172 పాయింట్ల వద్ద క్లోజయింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story