Stock Market: స్వల్ప లాభాలతో గట్టెక్కిన స్టాక్స్...
Stock Market: వారంరోజులుగా నష్టాల బాటలో ఉన్న స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో గట్టెక్కాయి.
Stock Market: వరుసగా నష్టా్ల్లో ఉన్న స్టాక్స్ ఊరట
Stock Market: వారంరోజులుగా నష్టాల బాటలో ఉన్న స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో గట్టెక్కాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభమైనప్పటినుంచి మార్కెట్లు తీవ్ర ఒడి దుడుకులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంతో 57,634.84 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 13 పాయింట్ల లాభపడి 16,985.60 దగ్గర ముగిసింది. నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్ , టైటాన్ , సన్ ఫార్మా స్టాక్స్ రెండు శాతంమేర లాభాలు గడించాయి. టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, విప్రో స్టాక్స్ ద్వారా మదుపర్లు స్వల్పంగా నష్టపోయారు.
Next Story




