Stock Market Today: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాలకు బ్రేక్ పడింది.

Arun Chilukuri
Updated on: 20 Dec 2022 8:15 PM IST
Stock Market Today Nifty Ends Around 18,385, Sensex Falls 103 pts
X

Stock Market Today: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాలకు బ్రేక్ పడింది. ఈ ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు మధ్యాహ్నానికి ఇంట్రాడే కనిష్టాలకు చేరుకున్నాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. అయినా మార్కెట్లు లాభాల్లోకి రాలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. రూపాయి బలహీనత, చైనాలో కోవిడ్ కేసుల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల నష్టపోయి.. 61 వేల 702 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 18 వేల 385 వద్ద క్లోజయ్యింది. మరోవైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.77 వద్ద స్థిరపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story