Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.

Arun Chilukuri
Published on: 10 Jun 2021 11:44 AM IST
Stock Market Today India Nifty Started With 62 Points Sensex 165 Points 10 06 2021
X

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. గత రెండు సెషన్లలో నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు తాజా సెషన్ లో లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా మెటల్స్, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలుస్తున్నాయి. ఉదయం పది గంటల సమయానికి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 165 పాయింట్లకు పైగా ఎగసి 52,106 వద్దకు చేరగా జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ 62 పాయింట్ల మేర లాభంతో 15,698 వద్ద కదలాడుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story