Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Published on: 5 April 2021 4:07 PM IST
Stock Market : Sensex Trades Over 800 Points Lower, Nifty Around 14,637
X

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ వెరసి సోమవారం కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 870 పాయింట్లు కోల్పోయి 49,159 వద్దకు చేరగా నిఫ్టీ 229 పాయింట్ల మేర నష్టంతో 14,637 వద్ద స్థిరపడ్డాయి.

ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలు బుధవారం వెల్లడి కానున్న నేపధ్యంలో మార్కెట్లలో అప్రమత్తత కొనసాగింది. తాజా వారం తొలి ట్రేడింగ్ సెషన్ లో గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నడుమ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం బలహీన ధోరణిని కొనసాగించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story