Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Published on: 7 April 2021 4:25 PM IST
Stock Market: Sensex Nifty hit Fresh Record Highs on 7th April 2021
X

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు బుధవారం లాభాల బాటన ట్రేడింగ్ ఆరంభించాయి. ఆరంభంనుంచి ఉత్సాహంగానే ఉన్న కీలక సూచీలు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి కమిటీ నిర్ణయాల వెల్లడి తదనంతరం మరింత జోష్ కొనసాగించాయి. అంచనాలకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ విధాన నిర్ణయాన్ని వెలువరించడం మార్కెట్ కు బూస్ట్ లా పనిచేసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 460 పాయింట్లు ఎగసి 49,661 వద్దకు చేరగా నిఫ్టీ 135 పాయింట్ల మేర లాభంతో 14,819వద్ద స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story