దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల ముగింపు ...

Arun Chilukuri
Published on: 28 Dec 2020 5:03 PM IST
దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల ముగింపు ...
X

దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. తాజా వారం తొలి సెషన్ లో పటిష్ట ధోరణిన ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు లాభాల బాటన దూకుడుగా సాగాయి. ఆరంభ ట్రేడింగ్ లోనే సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభాలను ఆర్జించగా, నిఫ్టీ 13 వేల 800 పాయింట్ల ఎగువకు చేరింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 380 పాయింట్ల మేర ఎగసి 47,353 వద్దకు చేరగా, నిఫ్టీ 123 పాయింట్ల లాభంతో 13,873 వద్ద స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story