Stock Market: కరోనా దెబ్బకు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Published on: 20 April 2021 4:12 PM IST
Stock Market: Sensex Closes 243 points, Nifty ends below 14,296 on 20 April 2021
X

Stock Market: కరోనా దెబ్బకు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో తాజా వారం మలిరోజున ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాలతో శుభారంభాన్ని అందించాయి. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న ప్రకంపనలు లాక్ డౌన్లు ఆర్థికవ్యవస్థపై మరోమారు ఆందోళనలు వెరసి సూచీలు ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. అమ్మకాల వత్తిడి తీవ్రతరం కావడంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 243 పాయింట్లు క్షీణించి 47,705 వద్దకు చేరగా , నిఫ్టీ 63 పాయింట్ల మేర నష్టంతో 14,296 వద్ద స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story