Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 1707 , నిఫ్టీ 524 పాయింట్ల మేర నష్టాలను నమోదు చేశాయి.
Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 1707 , నిఫ్టీ 524 పాయింట్ల మేర నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1707 పాయింట్లు కోల్పోయి 47,883 వద్ద, నిఫ్టీ 524 పాయింట్లు మేర నష్టంతో 14,310 వద్ద స్థిరపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు కొవిడ్ సెకండ్ వేవ్ ప్రకంపనల నేపధ్యంలో దేశీ స్టాక్ సూచీలు తాజా వారం తొలి సెషన్ లో భారీ నష్టాలను మూటగట్టాయి. పెరుగుతున్న లాక్‌డౌన్‌లు, వ్యాక్సిన్ కొరతకు సంబంధించిన వార్తలు మరోవైపు కంపెనీల ఫలితాలు, కీలక గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు దిగడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపినట్లయింది.
Next Story




