Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: సెన్సెక్స్ 89.64, నిఫ్టీ 21.65 పాయింట్లు గెయిన్

Shashank Gullapelli
Published on: 20 March 2024 5:41 PM IST
Stock Market Indices Recovered From Heavy Losses
X

Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: నిన్న బేర్ దెబ్బకు కుదేలైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఇవాళ కాస్త పుంజుకున్నాయి. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 89.64 పాయింట్ల లాభంతో 72 వేల 101.69 వద్ద ముగియగా..నిఫ్టీ 21.65 పాయింట్ల లాభంతో 21 వేల 839.10 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు నష్టపోయాయి. మరోవైపు వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో..మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫెడ్‌ నిర్ణయాలు రేపటి మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే అవకాశముందని బిజినెస్ ఎక్స్‌‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story