Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటన దూకుడు కొనసాగించాయి.

Arun Chilukuri
Published on: 8 April 2021 4:44 PM IST
Stock Market: Indian Stock Markets End With Profit
X

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటన దూకుడు కొనసాగించాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో దేశీ స్టాక్‌ సూచీలు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించి, లాభాల్లోనే ముగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 84 పాయింట్లు పెరిగి 49,746 వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 14,873 వద్ద స్థిరపడ్డాయి. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఇటీవల కాస్త నెమ్మదించిన సూచీలు వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలను అందించాయి. కరోనా ప్రకంపనల నడుమ కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండా, సర్దుబాటు వైఖరికి ఆర్‌బీఐ కట్టుబడి వుండటం మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపినట్లయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story