Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోమారు భారీ లాభాలను అందించాయి.

Arun Chilukuri
Published on: 1 April 2021 4:28 PM IST
Stock Market: Indian Stock Markets End With Profit
X

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోమారు భారీ లాభాలను అందించాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజున బెంచ్‌మార్క్ సూచీలు లాభాల బాటన దూకుడు కొనసాగించాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 520 పాయింట్లు మేర జంప్ చేయగా నిఫ్టీ 14,900 మార్క్ దిగువకు చేరాయి. అయితే దేశీయంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాల నేపధ్యంలో దేశీ మార్కెట్ లో అప్రమత్తత కొనసాగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 520 పాయింట్లు ఎగసి 50,029 వద్దకు చేరగా, నిఫ్టీ 176 పాయింట్లు మేర లాభంతో 14,867 వద్ద స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story