దూసుకుపోయిన మార్కెట్లు.. ఆద్యంతం లాభాల్లోనే ట్రేడింగ్

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఊపుమీదున్నాయి.

Arun Chilukuri
Published on: 1 Aug 2022 7:39 PM IST
Stock Market Highlights Sensex Ends 545 pts Higher and Nifty 182 Crosses 17340
X

దూసుకుపోయిన మార్కెట్లు.. ఆద్యంతం లాభాల్లోనే ట్రేడింగ్

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఊపుమీదున్నాయి. ఉదయం నుంచి సానుకూలంగా ఉన్న సూచీలు ట్రేడింగ్ ముగిసేవరకు అదే జోష్ కొనసాగించాయి. ఫలితంగా వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభాల జోరు కొనసాగింది. కనిష్టాల నుంచి రూపాయి తిరిగి కోలుకోవడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. జులై నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు విమాన ఇంధనం, కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గడం కూడా మార్కెట్ల ర్యాలీకి కొంత కలిసొచ్చింది. సెన్సెక్స్ 545 పాయింట్లు లాభపడి 58 వేల115 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 182 పాయింట్లు లాభపడి 17 వేల 340 వద్ద స్థిరపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story