Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

Arun Chilukuri
Published on: 2 March 2021 3:52 PM IST
Stock Market ends with profit
X

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండోరోజూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. అమెరికా మార్కెట్ల జోరుతో దేశీయ కీలక సూచీలు ప్రధాన మద్దతుస్థాయిలకు ఎగువన ట్రేడింగ్ ఆరంభించి లాభాల్లోనే ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 440 పాయింట్లు మేర లాభాన్ని నమోదు చేయగా నిఫ్టీ సైతం 14,900 పాయింట్ల ఎగువన స్థిరపడింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 447 పాయింట్లు ఎగసి 50,296 వద్దకు చేరగా, నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 14,919 వద్ద స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story