దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగింపు..

Arun Chilukuri
Published on: 31 Dec 2020 4:50 PM IST
దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగింపు..
X

దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. గత కొద్దిరోజులుగా వరుస లాభాలతో దూసుకెళ్తున్న దేశీ సూచీలు ఏడాది చివరిరోజును మాత్రం సాదాగా ముగించాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారి జాతీయ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 14 వేల మైలు రాయిని దాటినప్పటికీ ఇన్వెస్టర్ల అప్రమత్తతతో చివరకు 13,981 వద్ద ముగిసింది. అటు బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ సైతం 5 పాయింట్ల స్వల్ప లాభంతో 47,751 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది మొత్తంగా చూస్తే సెన్సెక్స్ 6 వేల పాయింట్లు నిఫ్టీ 2 వేల పాయింట్ల మేర లాభాలను నమోదు చేశాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story