Stock Market: ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించిన దేశీయ మార్కెట్లు

*533 పాయింట్ల లాభంతో 59,299 దగ్గర ముగిసిన సెన్సెక్స్ *159 పాయింట్లు లాభపడి 17,691 దగ్గర ముగిసిన నిఫ్టీ

Shilpa
Published on: 4 Oct 2021 6:00 PM IST
Stock Market Closed Today with NSE Nifty at 159 Points BSE Sensex at 533 Points 04 10 2021
X

 ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించిన దేశీయ మార్కెట్లు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Stock Market: స్టాక్ మార్కెట్ ఇవాల్టి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 500 పాయింట్ల మేర లాభపడింది. ముఖ్యంగా రియల్టీ, మెటల్‌, పవర్‌ సెక్టార్‌ షేర్లు రాణించడంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఉదయం 59వేల 63 పాయింట్ల దగ్గర లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపటికే భారీ లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో 667 పాయింట్లు ఎగిసిన సూచీ చివరికి 533 పాయింట్ల లాభంతో 59వేల 299 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 159 పాయిట్లు లాభపడి 17వేల 691 వద్ద స్థిరపడింది.

Shilpa

Shilpa

Next Story