SBI: ఎస్బీఐ ఖాతాదారులకి హెచ్చరిక.. మరిచిపోయి కూడా ఈ పనులు చేయొద్దు..!

State Bank of India Warns Customer About Cyber Fraud Know Details
x

SBI: ఎస్బీఐ ఖాతాదారులకి హెచ్చరిక.. మరిచిపోయి కూడా ఈ పనులు చేయొద్దు..!

Highlights

SBI: గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ విధానంలో పెను మార్పులు జరిగాయి.

SBI: గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ విధానంలో పెను మార్పులు జరిగాయి. ప్రస్తుతం ప్రజలు బ్యాంకుల్లో నగదు కోసం గంటల తరబడి లైన్‌లో వేచి ఉండకుండా ఆన్‌లైన్ పద్ధతుల్లో లావాదేవీలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI మొదలైన వాటి ద్వారా చెల్లింపు చేయడం ప్రారంభించారు. దీంతో వీలైనంత త్వరగా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది. టెక్నాలజీ వినియోగంతో పాటు సైబర్ నేరాల కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా సైబర్ నేరగాళ్లు కోట్లాది మందిని మోసం చేశారు.

ఈ రకమైన నేరాల నుంచి కస్టమర్లను సురక్షితంగా ఉంచడానికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులని హెచ్చరిస్తూనే ఉంది. ఇటీవల SBI తన వినియోగదారులను సైబర్ నేరాల నుంచి అప్రమత్తంగా ఉంచడానికి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో సైబర్ మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగల మార్గాల తెలియజేసింది. కాబట్టి మీరు ఇంటర్నెట్ మోసం నుంచి సురక్షితంగా ఎలా ఉండాలో తెలుసుకుందాం.

ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

1. ఏదైనా అనుమానాస్పద సందేశం, ఈ మెయిల్ వస్తే వాటికి స్పందించకూడదు. ఈ లింక్‌లో ఎలాంటి వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలను షేర్ చేయవద్దు.

2. నెట్ బ్యాంక్‌ని ఉపయోగించే ముందు మీరు ఉపయోగిస్తున్న నెట్‌వర్క్ సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించుకోండి.

3. బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్, బ్యాంక్ పాస్‌బుక్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి.

4. మీరు ఏదైనా సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే https://cybercrime.gov.in/ క్లిక్ చేయడం ద్వారా మీ ఫిర్యాదు నమోదు చేయండి.

ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తున్నప్పుడు మర్చిపోయి కూడా ఈ పని చేయవద్దు

1. క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ నంబర్, పిన్, సివివి నంబర్ వంటి బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. అలాగే మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను షేర్ చేయవద్దు.

2. మీ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు.

3. నకిలీ సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories