Lpg Cylinder: పెరిగిన ఎల్పీజీ ధరలతో విసిగిపోయారా.. ఈ ఒక్క పనిచేస్తే డబ్బు ఆదా..!

Solar Stove Surya Nutan Check here Price and all Details
x

Lpg Cylinder: పెరిగిన ఎల్పీజీ ధరలతో విసిగిపోయారా.. ఈ ఒక్క పనిచేస్తే డబ్బు ఆదా..!

Highlights

Lpg Cylinder:ఎల్పీజీ ధరల పెరుగుదల సామాన్యులకి పెద్ద గుదిబండలా తయారైంది. మీరు కూడా ఖరీదైన గ్యాస్‌ సిలండర్‌తో ఇబ్బంది పడుతుంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

Lpg Cylinder: ఎల్పీజీ ధరల పెరుగుదల సామాన్యులకి పెద్ద గుదిబండలా తయారైంది. మీరు కూడా ఖరీదైన గ్యాస్‌ సిలండర్‌తో ఇబ్బంది పడుతుంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ ఒక్క పనిచేస్తే ఉచితంగా ఆహారాన్ని వండుకోవచ్చు. ఇప్పుడు వంట చేయడానికి LPG సిలిండర్ అవసరం లేదు. ఇటీవల ప్రభుత్వం ఒక కొత్త పద్ధతిని తీసుకువచ్చింది. దీని ద్వారా తక్కువ ధరతో ఆహారాన్ని వండుకోవచ్చు. దాని గురించి తెలుసుకుందాం.

ప్రభుత్వం కొత్త విధానం

దేశంలోని ప్రభుత్వ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (IOCL)ఒక ప్రత్యేక స్టవ్‌ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా గ్యాస్ లేకుండా ఆహారాన్ని వండుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ సోలార్ స్టవ్ సూర్య నూతన్‌ను విడుదల చేసింది. ఫరీదాబాద్‌లోని ఇండియన్ ఆయిల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఈ సోలార్ స్టవ్‌ను తయారు చేసింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటింది. సూర్య నూతన్‌ స్టవ్‌ వాడితే గ్యాస్‌ సిలిండర్‌పై ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.

స్టవ్ ఖరీదు ఎంత..

సోలార్ స్టవ్ ఖరీదు రూ.12వేలు ఉంటుంది. అదే సమయంలో దీని టాప్ మోడల్ ధర రూ.23,000. ఈ స్టవ్‌ని కొనుగోలు చేయడానికి మీరు ఒక్కసారి మాత్రమే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ తర్వాత LPG గ్యాస్ సిలిండర్‌ను నింపవలసి ఉండదు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసినవారవుతారు.

కేబుల్ ద్వారా ఉపయోగించవచ్చు

మీరు ఈ సోలార్ స్టవ్‌ను వంటగదిలో ఉంచాలి. దానిపై ఒక కేబుల్ ఉంటుది. ఈ కేబుల్ వైరు ఇంటిపై ఉన్న సోలార్ ప్లేట్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. సోలార్ ప్లేట్ నుంచి ఉత్పత్తయ్యే శక్తి కేబుల్ ద్వారా స్టవ్‌లోకి వస్తుంది. దీంతో సులువుగా వంట చేసుకోవచ్చు. ఈ సోలార్ స్టవ్ గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories