స్టాక్ మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే.. మార్కెట్లను కుదిపేసిన దక్షిణాఫ్రికా వేరియంట్

* ఇవాళ ఉదయంనుంచి పతనావస్థలోనే మార్కెట్లు * కరోనా భయాలతో నష్టాల్లోకి జారిన సెన్సెక్స్

Shilpa
Published on: 26 Nov 2021 4:54 PM IST
Severe Loss to Stock Markets due to New Variant in South Africa
X

మార్కెట్లను కుదిపేసిన దక్షిణాఫ్రికా వేరియంట్(ఫైల్ ఫోటో)

Stock Market: స్టాక్ మార్కెట్ కు ఇవాళ బ్లాక్ ఫ్రైడేగా మిగిలింది. దక్షిణాఫ్రికా వేరియంట్ భయాలతో ఆసియా సూచీలన్నీ నష్టాలు మూటగట్టుకున్నాయి. మరోసారి లాక్ డౌన్లు తప్పవన్న అంచనాలు మదుపర్లను తీవ్ర నిరాశలోకి నెట్టాయి.

ఉదయం ఆరంభం నుంచే సెన్సెక్స్ నష్టాలను మూగట్టుకుంది. ఏ దశలోనూ పుంజుకోకపోగా మదుపర్ల భయాల కారణంగా 510 పాయింట్ల నష్టంతో 17,019 వద్ద నిఫ్టీ ముగిసింది. ఒక్క హెల్త్ కేర్ రంగం మినహా మిగతా అన్ని రంగాలు నష్టాల బాట పట్టాయి. మిడ్,స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

Shilpa

Shilpa

Next Story