దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాల ముగింపు..

Arun Chilukuri
Published on: 29 Dec 2020 4:00 PM IST
దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాల ముగింపు..
X

దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాల్లో ముగిశాయి. వారం తొలి రోజున సరికొత్త రికార్డులతో లాభాలను అందించిన దేశీ మార్కెట్లు మలి సెషన్ లోనూ అదే ధోరణిని కొనసాగించాయి. యూఎస్ మార్కెట్ల లాభాల ముగింపు, ఏషియా మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు సైతం లాభాల బాటన దూకుడుగా సాగాయి. ఆరంభ ట్రేడింగ్ లోనే సెన్సెక్స్ 300 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా, నిఫ్టీ 13 వేల 900 పాయింట్ల వద్దకు చేరింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్ల మేర ఎగసి 47,613 వద్దకు చేరగా నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 13,932 వద్ద స్థిరపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story