కోలుకున్న బుల్.. శుక్రవారం భారీ రికవరీ

కోలుకున్న బుల్.. శుక్రవారం భారీ రికవరీ
x
Highlights

కోవిడ్19 ప్రభావంతో గురువారం చరిత్రలో లేని పతనాన్ని చవి చూసిన దేశీయ మార్కెట్లు ఎట్టకేలకు లాభలబాట పడ్డాయి.

కోవిడ్19 ప్రభావంతో గురువారం చరిత్రలో లేని పతనాన్ని చవి చూసిన దేశీయ మార్కెట్లు ఎట్టకేలకు లాభలబాట పడ్డాయి. శుక్రవారం ఆరంభంలోనే ట్రేడింగ్‌లో భారీనష్టాలను చవి చూడటంతో ఏకంగా ట్రేడింగ్‌ను కొద్దిసేపు నిలిపేశారు. ఆ తర్వాత నెమ్మదిగా సూచీలు పుంజుకున్నాయి. దీంతో శుక్రవారం ట్రెడింగ్ ముగిసేసరికి లాభపడ్డాయి. గురువారం దాదాపు 52 వారాల కనిష్టానికి అన్ని హెవీ వెయిట్‌ షేర్లు పడి పోయాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఏకంగా 3200 పాయింట్లకు పైగా నష్టపోయాగా, నిప్టీ 868 పాయింట్లు పతనమైంది. ఆఖరి గంటలో కాస్త పుంజుకుని సెన్సెక్స్‌ 2919 పాయింట్ల నష్టంతో.. 32,778 వద్ద రెండేళ్ల కనిష్టానికి చేరింది. నిఫ్టీ 32 నెలల కనిష్టానికి చేరి 868 పాయింట్లు పతనమై 9,590 వద్ద నిలిచింది.

ఈ రోజు( శనివారం ‎) సెన్సెక్స్‌ 1,325.34 పాయింట్ల లాభపడి 34,103.48 వద్దకు చేరగా.. నిఫ్టీ 365 పాయింట్ల లాభంతో 9,955వద్ద స్థిరపడింది. గురువారంరోజు చరిత్రలో ఎన్నడు లేని విధంగా భారీ పతనం చవిచూశాయి. ఆ భయంతో ఉన్న మార్కెట్లు ఇవాళ ఆరంభంతో కాస్త నష్టాల్లోకి వెళ్లిపోయింది. 12 ఏళ్ల తర్వాత ఇండియా స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ను నిలిపివేశారు. సెబీ రూల్స్ ప్రకారం 10 శాతం సర్క్యూట్‌ బ్రేక్‌ కావడంతో నిలిపివేశారు.

కరోనా వైరస్ తీవ్రమైపోతుందనే ఆందోళన సూచీలను పడిపోయేలా చేసింది. శనివారం, ఆదివారం మార్కెట్లు క్లోజింగ్ డేస్ కావడంతో సోమవారం నాటికి కరోనా పరిణామాలు ఏవైనా వేగంగా జరిగితే ట్రేడింగ్ నష్టాలు చవి చూడకతప్పదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో షేర్ హోల్డర్స్ స్టాక్స్ అమ్మేస్తున్నారు.

కాగా.. ట్రేడింగ్ కొద్దిసేపు నిలివేసి తిరిగి పునప్రారంభించారు. దీంతో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. డాలర్ తో రూపాయి మారకం విలువ 73.90 రూపాయలుగా ఉంది. శుక్రవారం మార్కెట్లు ముగిసేసరికి సెన్సెక్స్‌ 1,325.34 పాయింట్ల లాభపడి 34,103.48 వద్దకు చేరగా.. నిఫ్టీ 365 పాయింట్ల లాభంతో 9,955వద్ద స్థిరపడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories