మరోమారు లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు ..

Arun Chilukuri
Published on: 11 Feb 2021 4:05 PM IST
మరోమారు లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు ..
X

మరోమారు లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు ..

దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాల్లో ముగిసాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 220 పాయింట్లు జంప్ చేయగా, నిఫ్టీ 15,170 పాయింట్ల ఎగువన స్థిరపడింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 222 పాయింట్ల లాభంతో 51 వేల మార్క్‌కు ఎగువన 51,531 వద‍్దకు చేరగా, నిఫ్టీ సైతం 66 పాయింట్ల లాభంతో 15,173 వద్ద స్థిరపడింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, దిగ్గజ రంగాల షేర్లలో లాభాల స్వీకరణతో తాజా సెషన్ ను సూచీలు నష్టాలతో మొదలుపెట్టాయి. ఆరంభ ట్రేడింగ్ లో ఒడుదొడుకులను ఎదుర్కొన్న దేశీ సూచీలు ఆ తదనంతరం కోలుకుని సానుకూల బాటన పయనిస్తూ లాభాల్లో ముగిశాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story