దేశీ మార్కెట్లు వరుసగా మూడో రోజూ భారీ లాభాలు

దేశీ మార్కెట్లు వరుసగా మూడో రోజూ భారీ లాభాలు
x
Highlights

*బడ్జెట్‌ ఉత్సాహానికి తోడు గ్లోబల్ మార్కెట్ల సానుకూల పరిణామాలు.. *వెరసి దేశీయ మార్కెట్లు మరోసారి భారీ లాభాల్లో క్లోజ్.. *ఆరంభంనుంచి జోరుగా సాగిన కీలక సూచీలు సెన్సెక్స్ , నిఫ్టీ.. .

దేశీ మార్కెట్లు వరుసగా మూడో రోజూ భారీ లాభాలతో ముగిసాయి. కేంద్ర బడ్జెట్‌ ఇచ్చిన ఉత్సాహానికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పరిణామాలు జత కలవడంతో దేశీయ మార్కెట్లు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. ఆరంభంనుంచి జోరుగా సాగిన కీలక సూచీలు తాజా సెషన్ లో ఆల్ టైం హై రికార్డులను నమోదు చేసాయి. ఇంట్రాడేలో 700పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ 50,472 వద్ద ఆల్‌ టైం గరిష్టాన్ని తాకింది. చివరకు 458 పాయింట్ల లాభంతో 50 వేల మార్క్‌కు ఎగువన 50,256 వద‍్దకు చేరగా...నిఫ్టీ సైతం రికార్డుస్థాయిలాభాలను నమోదు చేసింది..14, 840 స్థాయిని టచ్‌ చేసిన నిఫ్టీ సూచీ 142 పాయింట్ల లాభంతో 14,789 వద్ద స్థిరపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories