Stock Market: ఆల్‌టైం గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్

Stock Market: 620.73 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 26 Jun 2024 10:00 PM IST
Sensex hits all-time high
X

Stock Market: ఆల్‌టైం గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి రాణించాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే సూచీలు మరోసారి జీవనకాల గరిష్ఠాలను తాకాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 78 వేల 759.4 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23 వేల 889.90 పాయింట్ల వద్ద ఆల్‌టైం గరిష్ఠాలను నమోదు చేశాయి. ఆరంభంలో కాసేపు ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ... ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. చివరికి 620.73 పాయింట్ల లాభంతో 78 వేల 674 వద్ద ముగిసింది. నిఫ్టీ 147.50 పాయింట్ల లాభంతో 23 వేల 868 వద్ద స్థిరపడింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story