Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Stock Market: ఈ ఏడాది తొలి ఐదు నెల‌ల్లో ఈక్విటీ మార్కెట్లు ఊగిస‌లాట‌లోనే సాగాయి.

Arun Chilukuri
Updated on: 10 Jun 2022 9:01 PM IST
Sensex Down over 1,000 Points at Closing, Nifty Around 16,200
X

Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Stock Market: ఈ ఏడాది తొలి ఐదు నెల‌ల్లో ఈక్విటీ మార్కెట్లు ఊగిస‌లాట‌లోనే సాగాయి. ఈ నెల‌లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొన‌సాగుతోంది. ఒక‌వైపు ఆకాశాన్నంటే స్థాయిలో పెరుగుతున్న వ‌స్తువుల ధ‌ర‌లు, వాటిని క‌ట్టడి చేయ‌డానికి RBI వ‌డ్డీరేట్లు పెంచ‌డంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బ‌ల‌హీన ప‌డింది. దీనికి కరోనా ఉధృతి కూడా తోడవడంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ న‌ష్టాల‌తో ముగిశాయి. ఇన్వెస్టర్లు 3 ల‌క్షల 20 వేల కోట్ల సంప‌ద‌ను కోల్పోయారు. వీకెండ్ లో సెన్సెక్స్ ఒక వెయ్యి 17 పాయింట్లు న‌ష్టపోయి 54 వేల 303 వద్ద ముగిసింది. నిఫ్టీ 284 పాయింట్ల న‌ష్టంతో 16 వేల 193 పాయింట్ల వ‌ద్ద స్థిర ప‌డింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story