Stock Market: ఆల్ టైం రికార్డ్స్.. 78 వేల మార్క్ దాటిన సెన్సెక్స్

Stock Market: 712.44 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 Jun 2024 9:30 PM IST
Sensex crossed 78 thousand mark
X

Stock Market: ఆల్ టైం రికార్డ్స్.. 78 వేల మార్క్ దాటిన సెన్సెక్స్

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, HDFC, ICICI బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 78 వేల 164 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23 వేల 754.15 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 78 వేల మార్కును దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరికి 712.44 పాయింట్ల లాభంతో 78 వేల 053.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 183.45 పాయింట్ల లాభంతో 23 వేల 721.30 వద్ద స్థిరపడింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story