SBI: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు..

SBI Raises Interest Rates on 10 years FDs
x

SBI: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు..

Highlights

SBI: ఎస్బీఐ ఖాతాదారులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది.

SBI: ఎస్బీఐ ఖాతాదారులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. ఒక వారం వ్యవధిలో రెండుసార్లు వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. పదేళ్ల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన కొత్త రేట్లు జనవరి 22 నుంచి వర్తిస్తాయి. అయితే ఎంతమేరకు పెంచిందో వివరాలు తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఇప్పుడు రూ. 2 కోట్ల కంటే తక్కువ FDలపై తన డిపాజిటర్లకు 5.10 శాతం వడ్డీని ఇస్తుంది. గతంలో ఈ వడ్డీ రేటు 5 శాతంగా ఉండేది. ఒక వారం వ్యవధిలో స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు FD రేటును రెండుసార్లు పెంచి ప్రయోజనాన్ని అందించింది. మరోవైపు సాధారణ డిపాజిటర్ల కంటే సీనియర్ సిటిజన్లకే ఎక్కువ వడ్డీ ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు 2 కోట్ల కంటే తక్కువ FDకి 5.60 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో ఈ రేటు 5.50 శాతంగా ఉండేది. స్టేట్ బ్యాంక్ గత ఏడాది జనవరిలో FD వడ్డీ రేట్లను పెంచింది.

కొత్త వడ్డీ రేట్లు..

7-45 రోజులు - సాధారణ ప్రజలకు 2.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.40 శాతం

46 రోజుల నుంచి 179 రోజుల వరకు – జనరల్ 3.90 శాతం, సీనియర్ సిటిజన్ 4.40 శాతం

180 నుంచి 210 రోజులు - జనరల్ 4.40 శాతం, సీనియర్ సిటిజన్ 4.90 శాతం

211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ - జనరల్ 4.40 శాతం, సీనియర్ సిటిజన్ 4.90 శాతం

1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు- జనరల్ 5.10 శాతం, సీనియర్ సిటిజన్ 5.60 శాతం

2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ FDలు - జనరల్ 5.10 శాతం, సీనియర్ సిటిజన్ 5.60 శాతం

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - జనరల్ 5.30 శాతం, సీనియర్ సిటిజన్ 5.80 శాతం

5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల FDలు - జనరల్ డిపాజిటర్ 5.40, సీనియర్ సిటిజన్ 6.20 శాతం

Show Full Article
Print Article
Next Story
More Stories