ఎస్బీఐ ట్వీట్ల మీద పేలుతోన్న సెటైర్లు: చాన్స్ భలే వినియోగించుకున్న నెటిజన్లు

ఎస్బీఐ ట్వీట్ల మీద పేలుతోన్న సెటైర్లు: చాన్స్ భలే వినియోగించుకున్న నెటిజన్లు
x
Highlights

దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా 2019-20 వార్షిక నివేదిక ప్రకారం తన ఖాతాదారుల సంఖ్య అమెరికా జనాభాకంటే ఎక్కువ అంటూ సోషల్‌...

దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా 2019-20 వార్షిక నివేదిక ప్రకారం తన ఖాతాదారుల సంఖ్య అమెరికా జనాభాకంటే ఎక్కువ అంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. యూఎస్ జనాభా 33.2 కోట్లు ఐతే దేశవ్యాప్తంగా 22వేల 141శాఖల్లో 44.89 కోట్ల కస్టమర్లు తమ సొంతమని ఎస్బీఐ ట్వీట్‌ చేసింది. తమ వినియోగదారుల సంఖ్య మొత్తం అమెరికా జనాభా కంటే ఎక్కువగా ఉందంటూ ఉత్సాహంగా, గర్వంగా ప్రకటించింది. దీంతో నెటిజన్లు ఎస్‌బీఐ పనితీరుపై సెటైర్ల మీద సెటైర్లు సంధిస్తున్నారు.

ఎస్‌బీఐ సేవలకు సంబంధించి తమకెదురైన చేదు అనుభవాలు అనుభవించిన ఫ్రస్ట్రేషన్‌ను ప్రకటించేందుకు యూజర్లు ఈ చాన్స్ భలే యూజ్ చేసుకున్నారు. కస్టమర్లకు పేలవమైన సేవను అందించడానికి కారణం అదేనా అంటూ ఒకరు.. ఎస్‌బీఐ సిబ్బంది మొరటు ప్రవర్తన, అసమర్థత.. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో అంటూ మరొకరు ఘాటుగానే స్పందించారు. ఇక అటు అమెరికా జనాభాను మించిన యూజర్లు అంటూ టెలికాం రంగ దిగ్గజం రిలయన్స్‌ జియో కూడా ఇలాంటి సమాచారాన్ని ట్విటర్‌లో వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories