logo
వ్యాపారం

SBI Alert: ఎస్బీఐ అలర్ట్‌.. వారికోసం 20,000 వరకు నగదు ఇంటికే..!

SBI Doorstep Banking Services Chek for all Details
X

SBI Alert: ఎస్బీఐ అలర్ట్‌.. వారికోసం 20,000 వరకు నగదు ఇంటికే..!

Highlights

SBI Alert: మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.

SBI Alert: మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజుల్లో చాలా వరకు పని ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతోంది. అయితే కొన్నిసార్లు డబ్బుల కోసం బ్యాంకు లేదా ఏటీఎం చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది కాకుండా అవసరమైన పత్రాల సమర్పణ కోసం సంబందించిన శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల సీనియర్ సిటిజన్లు లేదా దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

డోర్‌స్టెప్ బ్యాంకింగ్‌

ఇటువంటి కస్టమర్ల సమస్యలను అధిగమించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక సేవను ప్రారంభించింది. ఈ సేవ పేరు SBI డోర్‌స్టెప్ బ్యాంకింగ్. దీని ద్వారా వినియోగదారులు ఇంట్లో కూర్చొని నగదు పొందవచ్చు. ఇది కాకుండా మీరు SBI డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా అనేక రకాల సేవలను పొందుతారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఇంట్లో నుంచి ఆర్డర్

SBI డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా ఇంట్లో కూర్చొని రూ.1,000 నుంచి రూ.20,000 వరకు ఆర్డర్ చేయవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పుడు నగదు డెలివరీ సౌకర్యం వినియోగదారుడికి అందుబాటులో ఉంటుంది. బ్యాలెన్స్ లేని పక్షంలో మీ లావాదేవీ రద్దు అవుతుంది.

నెలలో మూడు సేవలు ఉచితం

వైకల్యం ఉన్న వ్యక్తి నెలకు మూడుసార్లు ఉచిత డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవను పొందుతారు. తర్వాత కూడా మీరు ఈ సదుపాయాన్ని తీసుకుంటే దాని కోసం ప్రత్యేక రుసుమును చెల్లించవలసి ఉంటుంది. దీంతో పాటు డోర్‌స్టెప్ బ్యాంకింగ్‌లో నగదుతో పాటు అనేక ఇతర బ్యాంకింగ్ సేవల ప్రయోజనాన్ని పొందవచ్చు. బ్యాంక్ 2018 సంవత్సరం నుంచి తన అన్ని శాఖలలో ఈ సేవను అందిస్తోంది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ పొందడానికి ముందుగా మీ అకౌంట్‌ ఉన్న శాఖలో పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత మీరు ఈ సేవను పొందడం ప్రారంభిస్తారు.

Web TitleSBI Doorstep Banking Services Check for all Details
Next Story