SBI Customers: ఎస్‌బీఐ కస్టమర్లు డబ్బు విత్ డ్రా చేయడం చాలా సులభం.. ఏటీఎం కార్డ్ కూడా అవసరం లేదు..

SBI Customers can Withdraw Money Through the Yono App Without the Need for an ATM Card
x

SBI Customers: ఎస్‌బీఐ కస్టమర్లు డబ్బు విత్ డ్రా చేయడం చాలా సులభం.. ఏటీఎం కార్డ్ కూడా అవసరం లేదు..

Highlights

SBI Customers: డబ్బు ఎవ్వరికైనా అవసరమే. అందుకోసం కొంతమంది బ్యాంకుకి వెళ్లి వోచర్ రాసి విత్ డ్రా చేసుకుంటారు.

SBI Customers: డబ్బు ఎవ్వరికైనా అవసరమే. అందుకోసం కొంతమంది బ్యాంకుకి వెళ్లి వోచర్ రాసి విత్ డ్రా చేసుకుంటారు. మరికొంతమంది ఏటీఎం సెంటర్‌కి వెళ్లి కార్డ్ ద్వారా విత్ డ్రా చేస్తారు. కానీ మీకు డబ్బు అత్యవసరమై ఉండి బ్యాంకు అందుబాటులో లేకుండా ఏం చేస్తారు. ఏటీఎం సెంటర్కి వెళుతారు అప్పుడు మీ వద్ద ఏటీఎం కార్డు లేకుండా ఏం చేస్తారు తిరిగొస్తారు.. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే కార్డు లేకున్నా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ కస్టమర్లు యోనో యాప్ ద్వారా ఈ పని సులువుగా చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) YONO యాప్ ద్వారా డెబిట్ కార్డ్ లేకుండా ATMల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని అందిస్తోంది. అయితే ఇది కాకుండా మీరు కార్డ్ లేకుండా ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ నుంచి కూడా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ ఫోన్ నుంచి కొన్ని పనులు చేయాలి. దీంతో సులభంగా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు ATM నుంచి నగదును విత్‌డ్రా చేయాలంటే మీ ఫోన్లో SBI లేదా YONO యాప్‌ను కలిగి ఉండటం అవసరం. ఎందుకంటే ఇది లేకుండా ఈ ప్రక్రియ పూర్తి కాదు. ఈ యాప్ ద్వారా దేశంలోని ఏ మూలన ఉండి కార్డు లేకుండానే ఎస్బీఐ ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవచ్చు. ఈ సేవ ద్వారా మీరు ATM నుంచి కనీసం రూ. 500 నుంచి రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

కార్డ్ లేకుండా నగదు తీసుకునే ప్రక్రియ

1. మీ ఫోన్లో YONO యాప్‌ను డౌన్లోడ్ చేసి, దానికి లాగిన్ కండి.

2. YONO యాప్ కి వెళ్లి హోమ్ పేజీని తెరిచి YONO నగదు ఎంపికను ఎంచుకోండి

3. దీని తర్వాత, YONO నగదులోని ATM సెక్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మొత్తం దాని నుంచి విత్‌డ్రా చేయాల్సిన డబ్బు నమోదు చేయండి.

4. ఇప్పుడు మీరు అందులో 6 అంకెల పిన్‌ని సృష్టించాలి.

5. ఈ పిన్ మీ YONO నగదు లావాదేవీ నంబర్ పై రూపొందిస్తుంది.

6. ఆపై ATM లో YONO క్యాష్ ఎంపికపై క్లిక్ చేయండి.

7. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీరు 6 అంకెల పిన్‌ను నమోదు చేయాలి

8. వెంటనే మీ ప్రక్రియ పూర్తవుతుంది. మీరు నగదు పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories