SBI: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. 70% కంటే ఎక్కువ తగ్గింపు పొందండి..!

SBI: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. 70% కంటే ఎక్కువ తగ్గింపు పొందండి..!

Rama Rao
Updated on: 20 April 2022 10:00 AM IST
SBI Bumper Offer Shopping from SBI YONO App and Get Up to 70 Off
X

SBI: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. 70% కంటే ఎక్కువ తగ్గింపు పొందండి..!

SBI: ఎస్బీఐ కస్టమర్లకు ఇది శుభవార్తనే చెప్పాలి. బ్యాంక్ మీకు షాపింగ్ చేయడానికి అవకాశం కల్పిస్తోంది. మీరు వేసవి సీజన్ కోసం షాపింగ్ చేయాలనుకుంటే ఈరోజే చేయండి. SBI బ్యాంకింగ్ యాప్ YONO ద్వారా ఆర్డర్ చేస్తే మీరు భారీ డిస్కౌంట్లను పొందుతారు. ఈ ఆఫర్ గురించి పూర్లి వివరాలు తెలుసుకుందాం. ఈ సమాచారాన్ని SBI తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ విధంగా తెలిపింది. 'మీరు టాప్ ఫ్యాషన్ బ్రాండ్‌లపై చాలా తగ్గింపుని పొందుతారు. YONO యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే బ్రాండ్‌ను బట్టి తగ్గింపు ఉంటుంది. దీనిపై కస్టమర్ గరిష్టంగా 70 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. SBI కస్టమర్లకు బ్యాంకింగ్ సౌకర్యాలే కాదు ఇప్పుడు షాపింగ్‌ అనుభూతిని అందిస్తుంది' అని ట్వీట్‌ చేసింది.

మీరు ఈ ప్రయోజనం ఎలా పొందవచ్చు?

దీని కోసం ముందుగా SBI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. అవసరమైతే మీరు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి. తర్వాత ఈ యాప్‌లోనే టైటాన్, లైఫ్‌స్టైల్, ట్రెండ్స్, అజియో, బిబా వంటి బ్రాండ్‌ల నుంచి షాపింగ్ చేసే అవకాశాన్ని పొందుతారు. ఇక్కడ మీరు షాపింగ్ చేయవచ్చు. దాదాపు 70% వరకు తగ్గింపును పొందవచ్చు.

ఇలాంటి మరిన్ని ప్రయోజనాలు..

SBI ప్రకారం YONO యాప్ ద్వారా వివిధ బ్రాండ్‌ల కోసం షాపింగ్ చేసే కస్టమర్‌లు యాప్‌లో అందుబాటులో ఉన్న అన్ని డిస్కౌంట్‌లతో పాటు విడిగా పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపులపై ప్రత్యేక తగ్గింపులు, రివార్డులు ఉంటాయి. మీరు ఈ ఆఫర్‌లో మరిన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వెంటనే త్వరపడండి.

Rama Rao

Rama Rao

Next Story