SBI Alert: ఎస్బీఐ అలర్ట్‌.. ఖాతా నుంచి డబ్బులు కట్‌ అయ్యాయా..!

SBI Alert Know This if 147 Rupees is Deducted From the Account
x

SBI Alert: ఎస్బీఐ అలర్ట్‌.. ఖాతా నుంచి డబ్బులు కట్‌ అయ్యాయా..!

Highlights

SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల ఖాతాల నుంచి రూ.147 కట్ చేసింది.

SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల ఖాతాల నుంచి రూ.147 కట్ చేసింది. ఈ మెస్సేజ్‌ చూసి ఖాతాదారులందరు షాక్‌ అవుతున్నారు. బ్యాంకు ఈ మొత్తాన్ని ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ కోసం వార్షిక రుసుముగా కట్‌ చేసింది. కాబట్టి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని బ్యాంకులు కస్టమర్ల నుంచి డెబిట్ కార్డ్ ఛార్జీలను వసూలు చేస్తాయి. ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ వసూలు చేస్తాయి. అయితే ఇటువంటి విషయాల గురించి ఖాతాదారులకి కచ్చితంగా తెలిసి ఉండాలి.

అప్పుడే బ్యాంకు మీ ఖాతా నుంచి ఎక్కువ డబ్బు కట్‌ చేయకుండా ఉంటుంది. అంతేకాదు ఎటువంటి మోసాలు కూడా జరగకుండా ఉంటాయి. బ్యాంకులు లింగం, వయస్సు, మతం, కులం, శారీరక లోపం వంటి వాటిని పరిధిలోకి తీసుకోవు. అందరికి సమాన సేవలు, ఛార్జీలు ఉంటాయి. అయితే, బ్యాంకులని బట్టీ వడ్డీరేట్లలో మార్పు ఉంటుంది. ఈ మార్పులని రిజర్వ్‌బ్యాంక్‌ కూడా ఆమోదిస్తుంది.

బ్యాంకు ఉపయోగించే భాష సరళంగా, పారదర్శకంగా ఉండాలని అందరు అనుకుంటారు. నిబంధనల ప్రకారం బ్యాంకులు అన్ని ఒప్పందాలు పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలి. సామాన్యులకి సులభంగా అర్థం అయ్యేలా భాష ఉండాలి. వారిని సరైన అవగాహన కల్పించడం బ్యాంకుల బాధ్యత. లాభాలు, నష్టాల గురించి స్పష్టమైన సమాచారం అందించాలి. బ్యాంకులు ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. టెలిమార్కెటింగ్ కంపెనీలకు విక్రయించడానికి బ్యాంకులు వివరాలను అందించవు. బ్యాంకు నిబంధనలు పాటించకుంటే ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా బీమా కంపెనీలు, ఫండ్ హౌస్‌లు వంటి థర్డ్ పార్టీలకి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories