How to Become Millionaire: ఈ స్కీంలో రోజుకి రూ.100 పొదుపు చేయండి.. కోటీశ్వరులుగా మారండి..!

Save Rs 100 Per Day in Systematic Investment Plan Become a Millionaire
x

How to Become Millionaire: ఈ స్కీంలో రోజుకి రూ.100 పొదుపు చేయండి.. కోటీశ్వరులుగా మారండి..!

Highlights

How to Become Millionaire: తక్కువ సంపాదించే వారికి కూడా జీవితంలో కోటీశ్వరులు కావాలని కోరిక ఉంటుంది.

How to Become Millionaire: తక్కువ సంపాదించే వారికి కూడా జీవితంలో కోటీశ్వరులు కావాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఎక్కువ పొదుపు చేయాలని వీరు భావిస్తారు. కానీ ఇందులో నిజం లేదు. తక్కువ పొదుపు చేసి కూడా కోటీశ్వరులుగా మారవచ్చు. ఇందుకోసం పద్దతైన పొదుపుని అలవాటు చేసుకోవాలి. రోజుకి కేవలం రూ.100 పొదుపు చేసి కోటీశ్వరులుగా మారవచ్చు. ఈ స్కీంలో పెట్టుబడి పెడితే అది సాధ్యమే. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

చిన్న పొదుపులు పెద్ద ప్రయోజనాలు

తక్కువ డబ్బు సంపాదించినప్పటికీ రోజువారీ చిన్న మొత్తాన్ని ఆదా చేయడం వల్ల పెద్ద నిధులను సేకరించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. ఆదాయం పెరిగితే ఇన్వెస్ట్‌ మెంట్‌ చేద్దామని చాలామంది అనుకుంటారు. కానీ పొదుపుకి ఆదాయం పెరగడం అవసరం లేదు. తక్కువ మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టి మంచి ఫండ్‌ని తయారుచేయవచ్చు.

చిన్న పొదుపుతో కోటి రూపాయలు

ఈ రోజుల్లో చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసు. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP) ద్వారా కేవలం రోజుకి రూ.100 ఆదా చేయడం ద్వారా రూ.1 కోటి నిధిని సేకరించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో బంపర్ రాబడిని అందిస్తాయి. 20% వరకు రాబడిని ఇచ్చిన మ్యూచువల్ ఫండ్‌లు చాలా ఉన్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో SIP ద్వారా ప్రతిరోజూ రూ.100 పెట్టుబడి పెట్టి కోటీశ్వరుడి కలని నెరవేర్చుకోవచ్చు.

ఈ లెక్క అర్థం చేసుకోండి

రోజూ 100 రూపాయలు ఆదా చేయడం వల్ల ఒక నెలలో 3 వేల రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఏటా 20% రాబడిని పొందుతారు. ఈ విధంగా 21 సంవత్సరాలలో మీ ఫండ్ దాదాపు రూ.1,16,05,388 అవుతుంది.

ఈ సమయంలో మీరు మొత్తం రూ.7,56,000 మాత్రమే డిపాజిట్ చేస్తారు. ఒకవేళ ఈ చిన్న మొత్తానికి 20% బదులుగా 15% రాబడి వస్తే అప్పుడు కూడా లాభంలో ఉంటారు. రూ. 53 లక్షల భారీ మొత్తాన్ని పొందుతారు. తక్కువ సమయంలో కోటీశ్వరుడు కావాలనుకుంటే పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటు పోవాలి. అప్పుడే మీ కోరిక నెరవేరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories