దేశ చరిత్రలో అత్యంత కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ

Rupee Hits Fresh Record Low of 78.29 vs US Dollar
x

దేశ చరిత్రలో అత్యంత కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ

Highlights

Rupee Vs Dollar: డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి పడిపోయింది.

Rupee Vs Dollar: డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి పడిపోయింది. ఈ ఉదయం ఒక డాలర్ కు 78 రూపాయల13 పైసలతో ఫారిన్ ఎక్స్ఛేంజీ మార్కెట్ ప్రారంభమైంది. చివరికి 78 రూపాయల 40 పైసల వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడిదారులు దేశం నుంచి భారీ స్థాయిలో సొమ్మును వెనక్కి తీసుకుంటుండటంతో డాలర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అదే రూపాయి పతనానికి కారణమైందనీ తెలిపారు. ఒక్క జూన్ నెలలోనే ఇప్పటివరకు 38 వేల 500 కోట్ల మేర సొమ్మును విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు రిజర్వు బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగినా చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories