Jio: జియో యూజర్లకు మరో షాకింగ్ న్యూస్..!
Jio: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో యూజర్లకు మరో షాకిచ్చింది.
Jio: జియో యూజర్లకు మరో షాకింగ్ న్యూస్..!
Jio: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో యూజర్లకు మరో షాకిచ్చింది. వారం క్రితం ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు పెంచిన రిలయన్స్ జియో ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభించే ప్లాన్‌లను సవరించింది. గతంలో రూ.499కే ప్రారంభమయ్యే ఈ ప్లాన్లు ఇకపై రూ.601 నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే యూజర్లపై దాదాపు 20 శాతం అదనపు భారం పడనుందన్నమాట. ఈ పెరిగిన ప్లాన్స్ ధరలు డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. రూ. 499 ప్లాన్ ధరను రూ. 601గా, రూ. 666 ప్లాన్ ధరను రూ. 799గా, రూ.888 ప్లాన్ ధరను రూ. 1,066గా, రూ.2599 ప్లాన్ ధరను రూ. 3,119గా, రూ.549 ప్లాన్ ధరను రూ. 659 గా జియో సవరించింది.
Next Story




