Reliance Jio: మరోసారి దుమ్ములేపిన జియో.. ఆ నెట్‌వర్క్‌ను విడిచిపోతున్నారు..!

Reliance JIO: రిలయన్స్ జియో దేశంలోనే నంబర్ వన్ ప్రైవేట్ టెలికాం దిగ్గజంగా కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 20 July 2022 2:47 PM IST
Reliance Jio Adds 31 Lakh new Mobile Users in May, Says TRAI
X

Reliance Jio: మరోసారి దుమ్ములేపిన జియో.. ఆ నెట్‌వర్క్‌ను విడిచిపోతున్నారు..!

Reliance JIO: రిలయన్స్ జియో దేశంలోనే నంబర్ వన్ ప్రైవేట్ టెలికాం దిగ్గజంగా కొనసాగుతోంది. ఈ కంపెనీ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్‌లు, ప్లాన్‌లను ప్రవేశపెడుతుంది. ట్రాయ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం మే నెలలో రిలయన్స్ జియో రికార్డు స్థాయిలో కొత్త కస్టమర్లను చేర్చుకుంది. మే నెలలో జియో నెట్‌వర్క్‌ను కొత్తగా 31 లక్షల మంది ఎంచుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరిందని ట్రాయ్‌ తెలిపింది.

ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 10.27 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకుంది. దీంతో సంస్థ మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. మరో వైపు, వోడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య ఈ నెలలో 7.59 లక్షలు తగ్గడంతో 25.84 కోట్లకు పడిపోయింది. BSNL వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గిడంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 11.28 కోట్లకు పడిపోయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story