RBI: రూ. 2 వేల నోట్ల‌పై ఆర్బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. మార్కెట్లో ఇంకా ఉన్నాయా.?

RBI
x

RBI: రూ. 2 వేల నోట్ల‌పై ఆర్బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. మార్కెట్లో ఇంకా ఉన్నాయా.?

Highlights

RBI: రూ.2 వేల నోటు మార్కెట్ నుంచి పూర్తిగా వెనక్కి తీసుకున్నప్పటికీ, ఇప్పటికీ ప్రజల వద్ద కొన్ని వేల కోట్ల రూపాయల నోట్లు మిగిలే ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం, రూ.6,181 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ఇంకా చలామణిలో ఉన్నాయి.

ఇప్పటివరకు తిరిగొచ్చిన నోట్లు ఎంత?

ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న మొత్తం రూ.2 వేల నోట్లలో 98.26% నోట్లు ఇప్పటికే తిరిగి బ్యాంకులకు చేరుకున్నాయి. అయితే మిగిలిన వాటిని ప్రజలు ఇప్పటికీ తమ వద్ద ఉంచుకున్నారు.

మార్చుకునేందుకు ఇంకా అవకాశం ఉందా?

గడువు ముగిసిన తర్వాత అయినప్పటికీ, ప్రజలు ఈ నోట్లను ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసుల్లో మార్చుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో వ్యక్తిగతంగా వెళ్లి ఈ నోట్లు మార్చుకోవచ్చు లేదా ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు.

తపాలా కార్యాలయాల ద్వారా మార్పిడి

ఇతర రాష్ట్రాల్లో నివసించే వారు తమకు దగ్గరలో ఉన్న తపాలా శాఖల (Post Offices) ద్వారా ఈ నోట్లను ఆర్‌బీఐకి పంపించి, తమ బ్యాంక్ ఖాతాల్లోకి డిపాజిట్‌ చేయించుకునే వీలును పొందవచ్చు. స్వ‌యంగా వెళ్ల‌లేని వారికి ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డనుంది.

ఆర్బీఐ సూచనల మేరకు, రూ.2 వేల నోట్లు ఇంకా ఎవరి వద్దనైనా ఉంటే, వాటిని త్వరగా అధికారిక మార్గాల్లో రిటర్న్ చేయడం ఉత్తమం. లేదంటే ఆ నోట్ల విలువ కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories