RBI: బ్యాంకు ఖాతాదారులకి బ్యాడ్‌ న్యూస్‌.. అన్ని లోన్లపై పెరగనున్న వడ్డీరేట్లు..!

RBI Raises Repo Rate to 4.5 per Cent CRR
x

RBI: బ్యాంకు ఖాతాదారులకి బ్యాడ్‌ న్యూస్‌.. అన్ని లోన్లపై పెరగనున్న వడ్డీరేట్లు..!

Highlights

RBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటుని అకస్మాత్తుగా పెంచి దేశంలోని కోట్లాది మంది ప్రజలకి అనుకోని షాక్ ఇచ్చింది.

RBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటుని అకస్మాత్తుగా పెంచి దేశంలోని కోట్లాది మంది ప్రజలకి అనుకోని షాక్ ఇచ్చింది. ఆర్‌బీఐ ఈ చర్య తర్వాత బ్యాంకుల వద్ద ఉన్న నగదు 87,000 కోట్లు తగ్గుతుంది. ఆర్‌బీఐ కీలక పాలసీ రేటు రెపో రేటును 0.40 శాతం నుంచి 4.40 శాతానికి పెంచింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను 0.50 శాతం నుంచి 4.5 శాతానికి పెంచాలని నిర్ణయించారు.

రెపో రేటు అకస్మాత్తుగా ఎందుకు పెంచారు..?

వాస్తవానికి మూడు నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6 శాతానికి పైగానే ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం రేటును 2 శాతం వైవిధ్యంతో 4 శాతం వద్ద కొనసాగించే బాధ్యత ఆర్బీఐకి అప్పగించారు. ఈ పరిస్థితిలో వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేటును పెంచాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో కంపెనీలు, ప్రజలు రుణాలు తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని.

రెపో రేటు పెంపు ప్రభావం మీ హోమ్ లోన్, కార్ లోన్ లేదా మరేదైనా రుణంపై ఉండవచ్చు. మీరు ఇప్పటికే రుణం పొందుతున్నట్లయితే లేదా రుణం తీసుకోబోతున్నట్లయితే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొత్త, పాత ఖాతాదారులపై ప్రభావం చూపుతుంది. బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాల రేటును రెపో రేటు అంటారు. రెపో రేటు పెరగడం వల్ల బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి ఎక్కువ రేటుకు రుణాలు పొందుతాయి. ఇది హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ మొదలైన వాటిపై వడ్డీ రేటును పెంచుతుంది. ఇది మీ EMIలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories